Monday, April 6, 2026
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ క్రీడల్లో రోల్‌ మోడల్‌

హైదరాబాద్‌ క్రీడల్లో రోల్‌ మోడల్‌

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

క్రీడల్లో హైదరాబాద్‌ను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లీలా హోటల్‌లో స్పోర్ట్స్‌ హబ్‌ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చి దిద్దిందడమే తన లక్ష్యమని తెలిపారు. జూన్‌ 2న గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఈలోగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్‌తో సహా అన్ని ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎయిర్‌పోర్ట్‌ నుంచి క్రీడాకారులు నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
గచ్చిబౌలి స్టేడియానికి భవిష్యత్‌లో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్చర్‌ను నియమించినట్టు వెల్లడించారు. స్టేడియం అభివృద్ధిపై బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్యమారన్‌, సంజీవ్‌ గోయెంకా, సి.శశిధర్‌, జయేష్‌ రంజన్‌, స్పోర్ట్స్‌ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -