- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని కస్రా గ్రామానికి చెందిన పానది గంగారాం (రెడ్డి మహారాజ్ ) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రే వార్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో గంగారం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దనీ, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఎన్నిల అనిల్, ఎకినోద్దిన్, దొంతుల దేవిదాస్, రమేష్, పోశెట్టి తదితరులు ఉన్నారు.
- Advertisement -



