– పాఠశాలలో యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి విద్యార్థులతో కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, విద్యార్థుల్లో నిరంతరం చైతన్యం నింపేందుకు పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ అనిల్ రెడ్డి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని విద్యార్థులను హెచ్చరించారు. యాంటీ డ్రగ్ కమిటీ సభ్యులు పాఠశాల లోపల, వెలుపల అనుమానాస్పద పరిస్థితులపై నిఘా ఉంచాలని సూచించారు.గంజాయి రహిత గ్రామంగా హస కొత్తూర్ ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



