- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం కొర్షవారిగూడెం శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. గంజాయి సేవించిన వారిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ సెంటర్కు తరలించాలని కోర్టు సూచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. వీరికి గంజాయి విక్రయించిన పాపిడిగూడెం గ్రామానికి చెందిన అల్లం వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు అశ్వారావుపేట ఎస్ఐ ఏటీ యయాతి రాజు తెలిపారు.
- Advertisement -


