Saturday, August 22, 2026
E-PAPER
Homeఆటలుఆసియా పోటీలకు కరాటే క్రీడాకారులు

ఆసియా పోటీలకు కరాటే క్రీడాకారులు

- Advertisement -

అభినందించిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌

ప్రతిష్టాత్మక ఆసియా కరాటే చాంపియన్‌షిప్స్‌ (క్యాడెట్‌, జూనియర్‌, అండర్‌-21)కు తెలంగాణ నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 4 నుంచి 11 వరకు జోర్డాన్‌ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి విశాల్‌ రెడ్డి, సత్య తేజ, నిష్ట గంగిసెట్టి, శశాంక్‌ సాత్విక్‌లు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్నారు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ స్పోర్ట్స్‌ కరాటే డూ అసోసియేషన్‌ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ క్రీడాకారులను శుక్రవారం తన నివాసంలో అభినందించారు. కార్యక్రమంలో భారత చీఫ్‌ కోచ్‌ మల్యాల రామస్వామి, అసోసియేషన్‌ ప్రతినిధులు వెంకటేశ్‌, నరేశ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -