Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంఅసెంబ్లీ ఎన్నికల బరిలో దిగ్గజాలు

అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగ్గజాలు

- Advertisement -

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు
జాతీయ రాజకీయాల్లో ప్రభావం
న్యూఢిల్లీ :
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. హేమాహేమీలు ఈ ఎనికల్లో పోటీ పడుతున్నారు. సీనియర్‌ నాయకులు, పోరాట యోధులు, రాజకీయ వారసులు ఈ బరిలో ఉన్నారు. ఐదుగురు ముఖ్యమంత్రులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. అధికారాన్ని నిలుపుకోవాలని అధికారపార్టీలు చెమటోడుస్తున్నాయి. ఎలాగైనా ఆయా రాష్ట్ల్రాల్లో పాగా వేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. తమ పార్టీలు, అభ్యర్థులను గెలిపించుకొనుందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయి.

బెంగాల్‌లో…
పశ్చిమ బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని అక్కడి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ భావిస్తున్నారు. బీజేపీతో హోరాహోరీ పోరును ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రంలో చైతన్యవంతులైన కమ్యూనిస్టులు బీజేపీ, తృణమూల్‌ను సమర్థవంతంగా ఢకొీట్టేందుకు ఐక్యంగా ఎన్నికల బరిలో నిలిచారు. ‘సర్‌’ ఎఫెక్ట్‌ బెంగాల్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫలితాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. మతాలవారీగా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

తమిళనాడులో…

తమిళనాడులో త్రిముఖ పోరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎమ్‌కే అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్తగా ఈ ఎన్నికల్లో సీనీ హీరో, టీవీకే అధినేత దళపతి విజరు రాష్ట్రవ్యాప్తంగా తన అభ్యర్థులను బరిలో నిలిపారు. డీఎమ్‌కేకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకేను బీజేపీ మింగేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తులు పెట్టుకొన్ని ఎన్నికల బరిలో నిలిచాయి. దీనితో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.

అసోంలో…

తలతిక్క వ్యాఖ్యలు చేస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలవాలని తాపత్రయపడే అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్ని ఇప్పటికే న్యాయస్థానాలు పలుమార్లు ఆక్షేపించాయి.
తీరు మార్చుకోవాలని సీఎంను హెచ్చరించాయి. కానీ ప్రజల్ని వర్గాలవారీగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఏమేరకు నిలువరిస్తారో చూడాలి. ఇప్పటికీ అసోంలో మైనార్టీలను అధికార బీజేపీ భయపెడుతూనే ఉంది. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షంలోని రాజకీయ వైరుధ్యాలే బీజేపీ బలంగా నిలుస్తున్నాయి. ప్రజాతీర్పు కోసం మరికొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

పుదుచ్చేరిలో…
కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో అసక్తికర రాజకీయపోరు జరుగుతోంది. ఇక్కడి అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్‌ రంగస్వామికి ప్రజలతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మరోసారి వాడుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌-డీఎంకే కూటమి ఎన్డీఏతో తలపడుతోంది.
పినరయి వెంటే కేరళం ప్రజానీకం ముఖ్యంగా కేంద్రంతో ఢ అంటే ఢ అని రాజకీయంగా పోరాడుతున్న కేరళం రాష్ట్రంలో వామపక్షాలు తమ బలాన్ని నిలుపుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇక్కడి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కమ్యూనిస్టులపై చవకబారు ఆరోపణలు చేస్తూ, ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. ఈ రాష్ట్రంలో ఖాతానే తెరవని బీజేపీ తన మతోన్మాద ఎజెండాను ఆయుధంగా చేసుకొని ఎన్నికల బరిలో నిలిచింది. అక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్న కేరళం ప్రజలు అక్కడి రాజకీయ కురువృద్ధుడు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెంటే నడుస్తున్నారు. అభ్యుదయ భావాలు, భావప్రకటన స్వేచ్ఛా, రాజ్యాంగ పరిరక్షణకు బాసటగా నిలుస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -