Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం శనివారం వెల్లడించింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ కూడా చేశారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, గండ్ర మోహన్ రావు కోర్టుకు వివరించారు.

పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు ఉన్నా స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టివేశాడని వెల్లడించారు. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విని తుది తీర్పును రిజర్వ్ చేస్తూ, సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -