Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ పెగులా

చాంపియన్‌ పెగులా

- Advertisement -

చార్లెస్టన్‌ ఓపెన్‌ 2026

చార్లెస్టన్‌ (యుఎస్‌ఏ) : డిఫెండింగ్‌ చాంపియన్‌, అమెరికా క్రీడాకారిణి జెస్సికా పెగులా చార్లెస్టన్‌ ఓపెన్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డబ్ల్యూటీఏ చార్లెస్టన్‌ ఓపెన్‌ మట్టి కోర్టులో దుమ్మురేపిన జెస్సికా పెగులా.. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఉక్రెయిన్‌ అమ్మాయి యులియాపై మెరుపు విజయం సాధించింది. 82 నిమిషాల్లో ముగిసిన టైటిల్‌ ఫైట్‌లో 6-2, 6-2తో జెస్సికా పెగులా ఏకపక్ష విజయం సాధించింది. తొలి సెట్‌ ఐదో గేమ్‌లో తొలి బ్రేక్‌ పాయింట్‌ సాధించిన జెస్సికా.. యూలియా ఫోర్‌హ్యాండ్‌ తప్పిదంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఉక్రెయిన్‌ అమ్మాయి ఒత్తిడికి గురవగా.. మరో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన పెగులా 3-2తో ముందంజ వేసింది.

4-2తో పైచేయి సాధించి.. డబుల్‌ బ్రేక్‌ పాయింట్లతో పెగులా అదరగొట్టింది. రెండో సెట్లోనూ దూకుడుగా ఆడిన పెగులా ఆరంభంలోనే యూలియా సర్వ్‌ను బ్రేక్‌ చేసింది. 2-0తో ముందంజ వేసింది. ఎదురుదాడి చేయటంలో యూలియా పూర్తిగా తేలిపోగా.. పెగులా 5-1తో టైటిల్‌ను ఖాయం చేసుకుంది. జెస్సికా పెగులా 3 ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. యూలియా ఓ ఏస్‌, ఓ బ్రేక్‌ సాధించింది. పాయింట్ల పరంగా 65-40తో జెస్సికా పెగులా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో అమెరికా జంట డిసైరె, కాటీ 6-3, 6-2తో ఫ్రెచ్‌, అనాలపై గెలుపొంది చాంపియన్స్‌గా నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -