- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని యన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా కోర్టు జడ్జి న్యాయమూర్తి మున్నవర్ హుస్సేన్, ఎస్ఐ నరెందర్ సమక్షంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోక్సో చట్టం, సైబర్ క్రైమ్, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు ర్యాగింగ్ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి, వాటిని ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని న్యాయమూర్తి సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



