Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeరాష్ట్రీయంములకలపల్లి కుమారి ఆశయ సాధనకు కంకణబద్ధులు కావాలి

ములకలపల్లి కుమారి ఆశయ సాధనకు కంకణబద్ధులు కావాలి

- Advertisement -

– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-మునగాల

ములకలపల్లి కుమారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని కొక్కిరేణి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు సతీమణి కుమారి సంస్మరణసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములకలపల్లి రాములు పార్టీ నాయకునిగా ఎదగడంలో కుమారి సహకారం ఎంతో ఉందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మునగాల మండలంలో శత్రువుల భారీ నుంచి పార్టీని, కార్యకర్తలను కాపాడటంలో కుమారి భర్త ములకలపల్లి రాములు ఎంతో కృషి చేశారని చెప్పారు. పార్టీ ప్రజాసంఘాల కార్యక్రమాల్లో కుమారి చురుకుగా పాల్గొనేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బాధ్యతల్లో ఉన్న నాయకులకు కుటుంబ బాధ్యతలు చూసే మహిళలు మరణించడం చాలా బాధాకరమన్నారు. అంతకుముందు కుమారి చిత్రపటానికి పలువురు పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుమారి స్మృతి యార్థం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాటల సీడీని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. పార్టీ గ్రామ కార్యదర్శి నందిగామ సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పన పద్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సీపీఐ జిల్లా నాయకులు దొడ్డా వెంకటయ్య, న్యూడెమోక్రసీ నాయకులు ఒక్కంతుల ప్రభాకర్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు వస్కుల ముట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad