Sunday, August 23, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్స్వతహాగా ముడుచుకునే బాటిల్‌

స్వతహాగా ముడుచుకునే బాటిల్‌

- Advertisement -

లిటిల్‌ సైంటిస్ట్‌

కావాల్సిన వస్తువులు:
వాడిన వాటర్‌ బాటిల్‌, క్యాండిల్‌, అగ్గిపెట్టె.
ప్రయోగం చేయు విధానం: ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులారా ఒక క్యాండిల్‌ను అగ్గిపెట్టె సహాయంతో అంటించి బాటిల్‌ మూతలో అమర్చుకోవాలి. ఆ తర్వాత బాటిల్‌ని మండుతున్న క్యాండిల్‌ మీద పెట్టండి. కొంతసేపటి తర్వాత క్యాండిల్‌ ఆరిపోతుంది. తర్వాత బాటిల్‌ని గమనించండి .
ప్రయోగ వివరణ: మీరు బాటిల్‌ని మండుతున్న క్యాండిల్‌ మీద పెట్టినప్పుడు క్యాండిల్‌ ఆరిపోయి బాటిల్‌ ముడుచుకుంటుంది. ప్రయోగానికి ముందు బాటిల్‌ లోపల, బయట గాలి పీడనం సమానంగా ఉంటుంది. మండుతున్న క్యాండిల్‌ మీద బాలిల్‌ పెట్టినప్పుడు అందులోని కొంచెం గాలి (గాలిలోని ఆక్సిజన్‌) వాడుకోబడి క్యాండిల్‌ ఆరిపోతుంది. తర్వాత బాటిల్‌ లోపల కొంచెం శూన్యం ఏర్పడుతుంది. అందువల్ల బాటిల్‌ లోపల బయటకన్నా తక్కువ పీడనం ఉంటుంది. ఎక్కువ పీడనం వద్ద ఉన్న బయటి గాలి తక్కువ పీడనం ఉన్న బాటిల్‌ లోపలికి పోయే క్రమంలో బాటిల్‌ మీద ఒత్తిడి పడి బాటిల్‌ ముడుచుకునేలా చేస్తుంది.

వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -