Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకెపి మహిళ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఐకెపి మహిళ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామంలో మంగళవారం నాడు ఐకేపీ గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధర కల్పించడంతోపాటు వరి ధాన్యానికి బోనస్ చెల్లిస్తుందని ఈ ఘనత ప్రజా పాలన ప్రభుత్వాన్ని దేనిని తెలిపారు వరి ధాన్యం రైతులు దళారులను ఆశ్రయించకుండా మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ ఐకెపి మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి సంగం సభ్యులు ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరి ధాన్యం రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -