Wednesday, April 8, 2026
E-PAPER
Homeసినిమాఅల్లరి నరేష్‌ హీరోగా 'కనక దుర్గ' ప్రారంభం

అల్లరి నరేష్‌ హీరోగా ‘కనక దుర్గ’ ప్రారంభం

- Advertisement -

తమిళ సినీ ఇండిస్టీలో విజయవంతమైన ప్రముఖ కంటెంట్‌ స్టూడియో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో భాగంగా టెంపుల్‌ టౌన్‌ పిక్చర్స్‌తో కలిసి చేయబోతున్న సినిమా ‘కనక దుర్గ’ను ప్రారంభిం చారు. అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ చౌదరి హీరోయిన్‌.
ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్‌. రవి కథ అందిస్తుండగా, ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.
సమీర్‌ నాయర్‌, దీపక్‌ సెహగల్‌, అజిత్‌ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.రవి నిర్మాతలు.
ఘనంగా జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సురేఖ కొణిదెలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, హరీష్‌ శంకర్‌, మిక్కిలినేని సుధాకర్‌, కోన వెంకట్‌, ప్రశాంత్‌ వర్మ, మధుర శ్రీధర్‌, స్వప్నాదత్‌, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్‌, అనురాధ గూడూరు, దివ్య విజరు, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్‌, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. స్వప్న దత్‌ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీస్‌ బిజినెస్‌ హెడ్‌ సునీల్‌ చైనాని మాట్లాడుతూ, ‘తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. భక్తి, సంస్కతి, భావోద్వేగాల కలయికలతో ఈ సినిమా రూపొందుతోంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -