ప్రజలకు కష్టమొస్తే ముందుగా తలుపు తట్టేది పోలీస్స్టేషన్దే. ఎవరైనా భద్రత కోసం, న్యాయం కోసం, చివరి ఆశగా ఠాణా గడప తొక్కుతారు. కానీ, వారికి అండగా నిలబడాల్సిన పోలీసులు నష్టం చేస్తే, ప్రాణాలకు ముప్పుగా తెస్తే, అప్పుడు వారంతా ఎవరి దగ్గరికి వెళ్లాలి? తమిళనాడులోని సాతన్కులం కస్టడీ హత్యపై మధురై ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఇది పోలీస్ వ్యవస్థకు మాత్రం గట్టి హెచ్చ రికగానే భావించాలి. ఎందుకంటే, సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రక్షణ వ్యవస్థే చట్టాన్ని తుంగలో తొక్కే దిశగా ముందుకు సాగితే అది ప్రజాస్వామ్యం పునాదినే దెబ్బతీస్తుంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో చిన్న నిబంధన ఉల్లంఘన పేరుతో తండ్రీ, కొడుకులను లాకప్‌డెత్ చేసిన తీరు చాలామందిచే కంటతడి పెట్టించింది. కస్టడీ అంటేనే భద్రత, చట్ట పరిరక్షణ అనే భావనను పూర్తిగా తారుమారు చేసిన ఈ ఘటన ఖాఖీల క్రౌర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. విచారణ పేరుతో సాగిన హింస, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నమోదైంది. అందుకే ఈ కేసును ప్రతిష్టా త్మకంగా తీసుకుని విచా రించిన న్యాయస్థానం తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ గతనెల 23న సంచలన తీర్పును వెల్లడించింది.
2020 కోవిడ్ కాలం, తుత్తూకుడి జిల్లా సాతన్కులంలో సెల్‌ఫోన్ దుకాణం నడుపుకునే తండ్రి జయరాజ్, కుమారుడు బెనిక్స్ను, సమయపాలన పాటించలేదని పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా జర గాల్సిన ప్రక్రియ జరి మానా లేదంటే హెచ్చరిక స్థానంలో స్టేషన్‌కు తరలించారు. అక్కడ జరిగి నది మాత్రం అమానుషం. సాక్ష్యాలు, వాంగూల్మాల ప్రకారం వారిని కులం పేరుతో దూషించారు, అవమాన కరంగా మాట్లాడారు. రాత్రంతా కొట్టారు. శారీరకంగా హింసించారు. ఈ క్రూరత్వంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పో యారు. ఒకరేమో ఇంటి పెద్దదిక్కు, మరొకరేమో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ బాగోగులు చూస్తున్నవాడు. ముందు కొడుకు చనిపోవడం, తర్వాత రోజుల్లో తండ్రి దూరమవ్వడం కుటుంబ సభ్యుల్నే కాదు, ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఆ కన్నీరే పోలీస్ వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపించింది, సమాజాన్ని తట్టి లేపింది. పోలీసుల ప్రవర్త నపై సోషల్ మీడియా, పత్రికల్లో దుమారం రేగింది. హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కలిసి కస్టడీ హింసపై ఉద్యమించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. స్పం దించిన మద్రాసు హైకోర్టు, మధురై ధర్మా సనం ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకుని సిబిఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు పదిమందిని నిందితులుగా గుర్తించారు. అయితే విచారణ సమయంలో ఒక పోలీసు అనారోగ్యంతో చనిపోగా మిగతా తొమ్మిది మందికి కోర్టు శిక్షను ఖరారు చేసింది.
చట్టం పోలీసులకు స్పష్టమైన బాధ్యతలను నిర్దేశిం చింది. అరెస్టు చేసిన వ్యక్తి హక్కులు, కస్టడీలో భద్రత, హింస నిషేధం వంటివి చట్టబద్ధమైన నియమాలు. అయినప్పటికీ వాస్తవంగా చాలాచోట్ల విచారణ పేరుతో వీటన్నింటినీ పూర్తిగా ఉల్లంఘించే ఘటనలు కోకొల్లలు. అధి కారం, రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఏం చేసినా బలా దూర్. అదే పేదలపై ఒత్తిడి, అక్రమ పద్ధతి కొనసాగిస్తూనే ఉంటారు. మృతులు జయ రాజ్, బెనిక్స్ దేశంలో కోట్లాది రూపాయల స్కామ్‌కు పాల్పడి పారిపోయినవారు కాదు, రేప్‌లు చేసి జైలు నుంచి విడుదలైన వారూ కాదు, మాదక ద్రవ్యాల మూఠాతో దందా నడుపుతున్న వారు అంతకన్నా కాదు. కనీసం అప్పటివరకు వారిపై ఎలాంటి నేరచరిత కూడా లేదు. మందలించి వదిలేయాల్సిన విషయంలో పోలీసులు ఆ అమా యకులపై ప్రతాపం చూపారు. చిన్న తప్పిదంతో స్టేషన్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కస్టడీ హింస ఎంత ప్రమా దకరమో ఈ ఘటన నిరూపించింది. ఇదేకాదు, దేశంలో లాకప ్డెత్లు, ఎన్కౌంటర్లు బూటకమనే విమర్శలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది. పోలీసు వ్యవస్థ పని తీరును కూడా మసకబారుస్తోంది.
ఈ కేసులో జడ్జి ముత్తుకుమారన్ తొమ్మిది మందికి మరణ శిక్ష విధిస్తూ చేసిన వ్యాఖ్య నిజంగా లాకప్‌డెత్ దృశ్యాన్ని కండ్లకు కట్టినట్టు చూపింది. ”ఇది సాధారణ మరణం కాదు, తండ్రీకొడుకులను ఎదురెదురుగా నగంగా నిలబెట్టి ఇష్ట మొచ్చినట్టు కొట్టారు.ఈ కేసు వివరాలు చదువు తుంటే బాధ ేసింది. దోషులకు జీవిత కాలం శిక్ష భయాన్ని కలిగించదు. వారికి ఉరే సరైన శిక్ష” అన్నారు. కానీ, కేవలం శిక్షలతో సమ స్యలు పరిష్కారం కావు. రక్షణ వ్యవస్థలో సంస్కరణలు, పార దర్శక పర్యవేక్షణ, మానవ హక్కులపై శిక్షణ, బాధ్యత నిర్ధారణ అమలు కావాలి. లేదంటే సాతన్ కులం వంటి ఘటనలు మళ్లీమళ్లీ పునరావృతమవుతూనే ఉంటాయి.ఇప్పుడు దోషులుగా తేలిన పోలీసుల స్థానంలో అప్పుడు పాలకులే కోర్టు బోనులో నిలబడాల్సి వస్తుంది.
సాతన్కులం..ఏం చెబుతోంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



