Monday, August 24, 2026
E-PAPER
Homeక్రైమ్మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై కేసు నమోదు

మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై కేసు నమోదు

- Advertisement -

కాంట్రాక్టర్‌‌ను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు
ఓఎస్డీ కార్ డ్రైవర్‌‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా ఉన్న సుమంత్ తన డ్రైవర్‌‌తోపాటు మరికొందరితో కలిసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక కాంట్రాక్టర్‌‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వారు ఆ కాంట్రాక్టర్ నుంచి పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ఈ దశలో గాయపడ్డ సదరు కాంట్రాక్టర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. అనంతరం తనపై సుమంత్ ఆయన డ్రైవర్‌, మరికొందరు కలిసి దాడి చేశారంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బాధితుడు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును జీరో ఎఫ్‌ఐఆర్‌ చేసిన మేడిపల్లి పోలీసులు ఆ కేసు తదుపరి దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోని సుమంత్ కారు డ్రైవర్‌‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -