Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం : మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆటో కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ ‌బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామనీ, వారు తమ సమ్మెను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీజిల్,పెట్రోల్ ఆటోలను రెటిరోఫిట్మెంట్ చేసుకోవడా నికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని తెలిపారు. 2015 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదనీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
ఆ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే క్యాబినెట్‌‌లో ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్‌కు రూ.1.50 సహాయం అందించాలని నిర్ణయం జరిగిందని వివరించారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని హామీనిచ్చారు.
హైదరాబాద్‌లో దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -