Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్ల కళాశాలకు కొత్త శోభ.!

తాడిచర్ల కళాశాలకు కొత్త శోభ.!

- Advertisement -

రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు
సిఎస్ఆర్ నిధులతో ఉచిత బస్సు ప్రయాణం.
ఫలితాల్లో టాప్
నవ తెలంగాణ-మల్హర్ రావు.

మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్త శోభతో కలకలాడుతోంది.రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి.కళాశాలలో ఇప్పటికే అత్యాధునిక వసతులు  డిజిటల్ బోధన,ప్రయోగ పరీక్షలకు అత్యాధునిక పరికరాలున్నాయి.తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.విద్యార్థులు ఆటలు ఆదుకోవడానికి విశాలమైన ఆటస్థల మైదానం ఉంది.అనుభవజ్ఞులైన ధ్యాపకులచే విద్య బోధన చేస్తున్నారు.విద్యార్థులకు ఆహ్లాదం పంచనున్న విద్యాలయం ఉంది.

కళాశాల ప్రత్యేక ఇలా.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ,ఉత్తమ ఫలితాలతో జిల్లాలోనే అగ్రగామిగా నిలుస్తోంది.కళాశాల గత రెండేళ్లుగా ప్రిన్సిపాల్ శ్రీమతి విజయదేవి చొరవతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికతో పాటువిద్య ప్రమాణాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న కళాశాలకు ఇటీవల ఇంటర్ బోర్డు నుంచి అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ ద్వారా రూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయని ప్రిన్స్ పాల్ తెలిపారు.భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో కళాశాలలోని అన్ని బ్లాకులకు రంగులు వేయించారు.అలానే వాటర్ ప్లాంట్ ఇంకా వాష్ రూమ్స్ మరమ్మతులు చేయించారు.ఆకర్షణీయమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు.కళాశాల ఆవరణలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు.దీంతో కళాశాల సర్వాంగ సుందరంగా మారింది.కళాశాల ఇప్పుడు నూతన శోభను సంతరించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

విద్యార్థులకు డిజిటల్ తరగతులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు కళాశాల సిద్ధమైంది.వచ్చే విద్య సంవత్సరం నుండి డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.

కోర్సుల వివరాలు..

ప్రస్తుతం కళాశాలలో విద్యార్థుల కోసం నాలుగు గ్రూపులు ఎంపిసి,బైపిసి,సిఈసి,హెచ్ఈసి తెలుగు,ఇంగ్లీష్ మీడియం గ్రూపులతో నడుస్తుంది ఇవే కాకుండా ఈ సంవత్సరం నుంచి ఇంకా కొత్త గ్రూపులు వచ్చే అవకాశం ఉందని ప్రిన్స్ పాల్ తెలిపారు. 

ఫలితాల్లో టాప్..

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల్లో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.ఫలితాల్లో మేటిగా నిలుస్తుండటంతో స్థానిక విద్యార్థులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -