నవతెలంగాణ–కాటారం: కాటారం గ్రామపంచాయతి అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. సర్పంచ్ పంతకాని సడవాలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీపాద కాలనీలో రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను ఇరువైపులా తొలగిస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలతో కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా మారి, ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడిందని కాలనీ వసూలు ఆనందం వ్యకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండగుడ్ల బానయ్య, వార్డు సభ్యులు కొండ శ్రీరాములు పాల్గొని పనులను పర్యవేక్షించారు. స్థానిక కాలనీవాసులు కూడా చురుకుగా పాల్గొని శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ పంతకాని సడువలి తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రగతి బాటలో కాటారం గ్రామపంచాయతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



