Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాము కాటుకు గురైన మహిళను పరామర్శించిన సర్పంచ్

పాము కాటుకు గురైన మహిళను పరామర్శించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన తొగరీ మల్లీశ్వరి ఇటీవల వ్యవసాయ కూలీ పనులు చేస్తున్న నేపథ్యంలో పాము కాటుకు గురైంది. చికిత్స కోసం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వందపడకల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం బుధవారం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రునాయక్, ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్ తోపాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -