- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పట్టి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో మంగళవారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



