- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పాంగ్ర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగంబర్ పటేల్ తమ్ముడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బుధవారం ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు పరమర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్ రావు పటేల్ ,వైస్ చెర్మన్ ఎండి షారుక్ హైమద ,జిల్లా వైస్ మాజీ చెర్మన్ రాజన్న,మార్కెట్ డైరెక్టర్ అరుణ్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



