– జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ వెల్లడి
నవతెలంగాణ – జుక్కల్
కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జుక్కల్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ మహిళలకు కుట్టు వృత్తి ఆధారిత ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, కుట్టు వ్యాపారాన్ని విస్తరించేందుకు అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 1000 యూనిట్ల చొప్పున, ఒక్క యూనిట్ విలువ రూ.12 వేలు ఉంటుందనీ, 100% సబ్సిడీపై అందిస్తామని ప్రకటించారు. అర్హత కలిగిన బీసీ మహిళలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



