Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ వైద్య భవన్ ప్రారంభం..

తెలంగాణ వైద్య భవన్ ప్రారంభం..

- Advertisement -

-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 

ప్రభుత్వ డాక్టర్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం కోఠిలోని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తెలంగాణ వైద్య భవన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై వైద్య భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ వైద్యులు కోవిడ్ వంటి కష్ట సమయంలో వారు అందించిన సేవలు మరువలేనివి అన్నారు.

ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ డాక్టర్లకు అవసరమైన సేవలను ప్రభుత్వం అందిస్తోంది అని తెలిపారు.తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని, ఉస్మానియా హాస్పిటల్‌కు నూతన భవనాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డాక్టర్లు అకాంక్షించారు అని, వారి ఈ దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాం అన్నారు. గోషామహల్‌లో 26 ఎకరాల్లో సుమారు రూ,,3000 కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం అన్నారు. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో మరో మైలురాయి అవుతుంది అన్నారు.గత రెండు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖలో 10,327 నియామకాలు పూర్తి చేశాం. మరో 6,000 పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు.

నిన్ననే 174 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చాం అన్నారు.భవిష్యత్తులో డాక్టర్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పారు. డీపీహెచ్, టీవీవీపీలో పనిచేస్తున్న స్పెషలిస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అవకాశాలు కల్పించాం అన్నారు.జూనియర్ డాక్టర్ల స్టైపెండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలు 15% పెంచాం అన్నారు.

ట్రాన్స్‌‌ఫర్లు పారదర్శకంగా చేశాం. కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇస్తూ.. డాక్టర్లకు తమకు నచ్చిన పోస్టింగ్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాం అని తెలిపారు మీకు.కానీ, ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలంటే ఎలా ఇవ్వగలం?ట్రాన్స్‌ఫర్లు, డిప్యుటేషన్లు అంటూ వైద్య సేవలకు ఆటంకం కలిగించకండి అని చెప్పారు.

హెచ్ఆర్, ఇన్‌ఫ్రా, ఎక్విప్‌మెంట్, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ వంటివన్నీ మేము సమకూర్చినా అంతిమంగా వైద్య సేవలు అందించాల్సింది మీరే అన్నారు. జిల్లాల్లో ఉన్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు‌ అందించేందుకు అందరం కలిసి కృషి చేద్దాం అన్నారు.

డాక్టర్ల  జెన్యూన్ డిమాండ్లు అన్నీ మేము సానుకూలంగా పరిష్కరిస్తాం అన్నారు. మీరు ప్రజలకు సేవలు అందించడానికి సహకరించాలని మా విజ్ఞప్తి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టిన, కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డి ఎం ఈ డాక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ  ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ రవూఫ్, ఉపాధ్యక్షులు కృష్ణారావు దీన్ దయాల్, కార్యదర్శులు డాక్టర్ రమేష్ డాక్టర్ రామ్ సింగ్, సీనియర్ నాయకులు డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ పల్లం ప్రవీణ్, ప్రభుత్వ వైద్య అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -