జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు మెగా పి ఏన్ జి పైపు లైన్ ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా అదించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో మండాలలో పి ఏన్ జి పైపు లైన్ ద్వారా గ్యాస్ ఏర్పాటు కు సంబదించిన సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణ సంబంధిత శాఖల అధికారులతో పిఎన్జి అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాలుగు మండలాలకు మెగా గ్యాస్ పైప్ లైన్ ద్వారా గృహ వినియోగదారులకు సురక్షితంగా, నిరంతరంగా పిఎన్జి సరఫరా అందించేందుకు చేపడుతున్న పైపులైన్ పనుల పురోగతి పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెగా పిఎన్జి పైపులైన్ ఏర్పాటు పనులు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగాలని సూచించారు. పనులు వేగవంతంగా పూర్తి కావడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని తెలిపారు. మెగా గ్యాస్ పైపులైన్ పల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెగా గ్యాస్ మెయిన్ పైప్ లైన్ ద్వారా వచ్చే గ్రామాలకు రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు చేపట్టాలని అన్నారు. పనులు పూర్తి అయ్యేలా ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. పైపు లైన్ ద్వారా ప్రజలకు సురక్షిత గ్యాస్ సరఫరా అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మెగా సిటీ గ్యాస్ రిప్రజెంటేటివ్ రమేష్, వంశీ,జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి,తహశీల్దార్లు, ల్గొన్నారు.



