- Advertisement -
పౌర సరఫరాల శాఖ డిటి మాచన రఘునందన్
నవతెలంగాణ- మునుగోడు
లబ్ది దారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీ ని ప్రహాసనo చేసే డీలర్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం ఆయన మునుగోడు లో మాట్లాడుతూ..రేషన్ దుకాణంలో బియ్యం ఇచ్చే బదులు పైసలు ఇస్తున్నారు. అంటూ కొందరు డీలర్ల పీఓ పై ఫిర్యాదులు వస్తున్నాయని రఘునందన్ ఆక్షేపించారు. మూడు నెలల రేషన్ ఒకే మారు ఇస్తున్న నేపధ్యం లో కొందరు ప్రజలు రేషన్ దుకాణంలో బియ్యం కు బదులు గా డబ్బు తీసుకుంటున్నారు. అని సామాజిక మాధ్యమాల్లో వాయిస్ మెసేజ్ వైరల్ అయ్యిందని రఘునందన్ అన్నారు.
- Advertisement -



