Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంరైతాంగ ఉద్యమానికి 'సారంపల్లి' సేవలు చిరస్మరణీయం

రైతాంగ ఉద్యమానికి ‘సారంపల్లి’ సేవలు చిరస్మరణీయం

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
– గంగారంలో మల్లారెడ్డి సంస్మరణ సభ 
నవతెలంగాణ – సత్తుపల్లి

సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ నేత సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపంగా సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారం ప్రజాసంఘాల కార్యాలయంలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. ఈ  సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు సి నివాళులర్పించారు. మల్లారెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

​ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి తన జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతాంగ పోరాటాలకు అంకితమై పనిచేశారని కొనియాడారు. రైతు సమస్యలు, వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు విశేషమైన అవగాహన ఉండేదని పేర్కొన్నారు. రైతు హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన నిర్వహించిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడిన మల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. రైతులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కావూరి వెంకటేశ్వరరావు, కువ్వారపు లక్ష్మణరావు, పొలాసి భాగ్యమ్మ, దేవళ్ల రామారావు, గుంట్రు జయరాజు, కొలికపోగు రత్తయ్య, రాజేష్, మారేశ్వరి, మరియమ్మ, మద్దిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -