Wednesday, April 8, 2026
E-PAPER
Homeకరీంనగర్అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు

అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు

- Advertisement -

అమ్మాయిలు వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయండి
సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

ప్రేమ పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డి.ఎస్.పి నాగేంద్ర చారి తెలిపారు. డిఎస్పి కథనం ప్రకారం…
ఒక యువతిని రుద్రంగి కి చెందిన సింగారపు గణేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతు ప్రేమిస్తున్నని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఆ యువతి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గణేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు.

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ప్రేమ–పెళ్లి పేరుతో వెంటపడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వేధింపులకు గురైన యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -