నవతెలంగాణ – ఆర్మూర్
రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో పట్టణములోని మామిడిపల్లి చౌరస్తా సమీపములో ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రం కేంద్రాన్నీ అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ఎండాకాలములో బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్షా స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారిని అభినందించారు.
సంస్థ తరపున ఇటీవల రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత , పేద ప్రజల బాగోగుల మీద కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో హెల్త్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమములో రక్షా స్వచ్చంధ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, గోపి పట్వారి, SG శ్రీకాంత్ రాము, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శి తులసి పట్వారి, బేతు గంగాధర్, సంయుక్త కార్యదర్శులు మీరా శ్రవణ్, ఖాందేష్ సత్యం, ప్రమోద్, మక్కల సాయినాథ్, స్నేహ శ్రావణ్, ఖాందేష్ గంగా మోహన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.



