– ఇద్దరిపై కేసు నమోదు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని గంగారం గ్రామంలో నిషేధిత గుడుంబా తయారీ, రవాణా పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన లావుడియా రేక్య నాయక్, గుగులోతు తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గుడుంబా తయారు చేసి, గంగారం సహా పరిసర గ్రామాల్లో విక్రయించేందుకు క్యాన్లలో నింపుకుని తరలిస్తున్న సమయంలో పట్టుబడ్డారు.
పోలీసులు సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించి, సుమారు 20 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులిద్దరిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, గుడుంబా తయారీ, రవాణా, విక్రయం చట్టవిరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.



