- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి, జగదాంబ తండా, స్కూల్ తాండాలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో, రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని, మొదటి రకం ధాన్యానికి రు 2389, రెండవ రకం ధాన్యానికి రు 2369 ప్రభుత్వం నిర్ణయించిందని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ ఓ తిరుపతిరెడ్డి, సర్పంచులు సలావత్ బుచ్చిరెడ్డి, లలితా బాయ్ నంద, దోకి లచ్చయ్య, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు స్రవంతి, సత్యవతి, ఐకెపి సీసీలు భూమా గౌడ్, అబ్బ లింగం, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



