నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈనెల 20 వరకు ఇంటి నిర్మాణాలను పూర్తిచేసుకుని గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈనెల 20 నాటికి
గ్రామాల్లో స్లాబ్ లెవెల్ వచ్చిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకొని, గృహప్రవేశాలు చేయాలన్నారు. బేస్ మెట్టు, గోడల వరకు నిర్మించుకున్న లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణం కచ్చితంగా పూర్తి చేసుకున్నందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కొత్తపల్లి హారిక అశోక్, ఎనుగందుల శైలేందర్, ఉప సర్పంచులు కొత్తపల్లి అశోక్, తక్కువూరి రాజశేఖర్, హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయితీ కార్యదర్శులు గంగాజమున, రాఘవేందర్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



