– సర్పంచ్ ఏనుగందుల శైలేందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలనీ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్ గ్రామ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలని, వారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టారన్నారు.మొదటి విడతలో ఇండ్లు మంజూరైన లబ్దిదారులు ఇంటి నిర్మాణాలను తొందరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.
గృహ నిర్మాణం కోసం డబ్బులు అవసరం ఉన్న ఐకేపీ మహిళ సంఘ సభ్యులు రుణం కోసం ఐకేపీ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు విడతల వారిగా అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తింపచేసేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కార్యదర్శి రాఘవేందర్, ఐకేపీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎనేడ్ల గంగారెడ్డి, వార్డుు సభ్యులు అంజిత్, సంతోష్,సాదుల్లా, సురేష్, రాకేష్, అజయ్, అనిల్, వివోఏలు అనూష, ప్రేమల, రామ, సువర్ణ, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు నరేష్, హరీష్, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.


