అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇక ‘రాకా’ టైటిల్‌తో పాటుగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు.
అల్లు అర్జున్ చూపుల్లో వాడివేడి, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు అందరిలోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది.’రాకా’ ఒక భారీ సాంకేతిక చిత్రంగా ఉంటుందని, హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ నిర్మాణాన్ని సృష్టించాలని అట్లీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ‘జవాన్’, ‘తేరి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా అట్లీ నిలిచారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘రాకా’గా అల్లుఅర్జున్
- Advertisement -
- Advertisement -



