Thursday, April 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై తీర్పు 22కు వాయిదా

పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై తీర్పు 22కు వాయిదా

- Advertisement -

‘కాళేశ్వరం’ పనుల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్ట్‌ తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం కేసును విచారించింది. మార్చి 12న దీనిపై వాదనలు పూర్తవ్వగా కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కమిషన్‌ నివేదికను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత, కేసీఆర్‌, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె. జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

కమిషన్‌ తమకు సముచిత అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నివేదిక సమర్పించిందని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే కమిషన్‌ను వేశారని పిటిషనర్లు వాదిస్తుండగా, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే కాళేశ్వరంపై కమిషన్‌ వేశామని ప్రభుత్వం తెలిపింది. వాదనల సమయంలో కేసీఆర్‌ తరపు అడ్వకేట్‌.. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. 8(బీ), 8(సీ) నోటీసులు ఇవ్వలేదనీ, ఎక్కడా విట్నెస్‌తో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -