Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యాయమ ఉపాధ్యాయులను నియమించాలి

వ్యాయమ ఉపాధ్యాయులను నియమించాలి

- Advertisement -

మంత్రి వాకిటి శ్రీహరికి పీఆర్టీయూ టీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రాథమిక పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులను నియమించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు బుధవారం పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్‌ ముదిరాజ్‌ నేతత్వంలో నాయకులు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ను హైదరాబాద్‌లోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలలో యోగ కోసం వ్యాయమ ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్‌ అబ్దుల్లా, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రావుల కార్‌ వెంకటేశ్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -