టెస్కో ద్వారా నేరుగా కొనుగోలు ప్రారంభించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చేనేత రంగాన్ని రక్షించేందుకు ఏకీకృత నూతన టెండర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. పాత విధానంలోనే టెస్కో ద్వారా దుస్తులను కొనుగోలు చేయాలని కోరారు. నూతన టెండర్ విధానం అమలైతే చేనేత సహకార సంఘాలకు, నేత కార్మికులకు ఉపాధి దొరకడం కష్టమవుతుందని తెలిపారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నేతన్నలు మరింత సంక్షోభంలో పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం 2024, మార్చి 11న ఇచ్చిన జీవోను యథాతథంగా అమలు చేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల యూనిఫారమ్ తయారీకి సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్‌ను టెస్కోకు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం యూనిఫారాల కోసం ఇచ్చిన టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సంక్షేమ శాఖలకు అవసరమయ్యే దుస్తులను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే చేనేత ఉత్పత్తులను తప్పనిసరిగా టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి, నేత కార్మికుల నుంచి నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
చేనేత రంగంలో నూతన టెండర్ విధానాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



