Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు హైదరాబాద్‌లో టీజీఈజేఏసీ కార్యవర్గం

రేపు హైదరాబాద్‌లో టీజీఈజేఏసీ కార్యవర్గం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ) కార్యవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని లక్డికాపూల్‌ సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్‌లో జరగనుంది. ఈ మేరకు టీజీఈజేఏసీ చైర్మెన్‌ వి లచ్చిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి టీజీఈజేఏసీలోని భాగస్వామ్య సంఘాల రాష్ట్ర, అన్ని జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌), సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులతోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -