నవతెలంగాణ భువనగిరి: భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామంలో రైతు నల్లమాసు బలరాం కు చెందిన పాడి ఆవు కు కడుపులో నొప్పి రావడంతో క్రిటికల్ ఆపరేషన్ను రాయగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష విజయవంతంగా నిర్వహించారు. వివరాలను పరిశీలిస్తే కడుపులో పేగు ఒకదానికి ఒకటి చోచుకు పోగా, ల్యాప రోటమి ద్వారా పేగులను వెలికి తీసి, పక్క ఉన్న చొచ్చుకుపోయిన పేగు భాగాన్ని జాగ్రత్తగా బయటకు తీసి, రీ సెక్షన్ చేశారు. రిసెప్షన్లో కుళ్ళిపోయిన రేగు భాగాన్ని కత్తిరించి, మిగిలిన రెండు ఆరోగ్యకరమైన పేగు చివర్లను తిరిగి ఒకదానికి ఒకటి కుట్టి కలిపి, పేగులను తిరిగి పొట్టలోకి పంపి కండరాలను చర్మాని కుట్లు వేసి మూసివేస్తారు. క్రిటికల్ ఆపరేషను విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష బృందం సభ్యులు సురేష్, ఎల్లేష్, రమేష్, వెంకటేష్ లు పాల్గొనగా, గ్రామ సర్పంచ్ కాటిక జంగయ్య యాదవ్, ఉపసర్పంచ్ నల్లమల రాజు పాల్గొన్నారు.



