- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీఎంసీ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు. కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు టీఎంసీని వీడి ఎన్ సీపీఐ లో విలీనమవుతున్నట్లు గతంలో ప్రకటించారు.
- Advertisement -



