Thursday, April 9, 2026
E-PAPER
Homeక్రైమ్పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ నల్లగొండ: పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె సింహాద్రి ఎక్స్‌ప్రెస్ చక్రాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు.

తిప్పలమ్మగూడెం వద్ద పట్టాలపై రైలు నిలిచిపోవడంతో.. నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -