నవతెలంగాణ-రాజోలి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేత, ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆర్ విజయ్ కుమార్ పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అన్నారు. సారంపల్లి మృతి రైతు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతుల సంఘం వ్యవసాయ రంగంలో అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారని, వ్యవసాయ రంగంపై, తాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు అపారమైన జ్క్షానం ఉండేదని చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ సర్కిల్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు నరసింహులు, కృష్ణ, భవన నిర్మాణ కార్మికులు గౌండరాజు, పరిశుద్ధ కార్మికులు మహేష్, గ్రామ రైతులు బెంజమిన్, దేవరాజు పాల్గొన్నారు.
సారంపల్లి మృతి రైతు ఉద్యమాలకు తీరని లోటు: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



