Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి అబు హుసేం ఖాన్ చౌదరి కన్నుమూశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన ఆయన, కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 88 ఏండ్ల వయసులో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు మాల్దాలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. 1996 నుంచి 2006 వరకు కాలియాచోక్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన, మాల్దా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ కాలంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -