- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ సిటీతో పాటు సదరన్ డిస్కం పరిధిలో 47,854 గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచితంగా 104 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులపై ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యుత్ ఛార్జీల కింద రూ.16.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
- Advertisement -



