Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరిధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

వరిధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానన్ దేశాయ్
నవతెలంగాణ – మద్నూర్

మండలంలోని ఎనబోరా, మాదన్ ఇప్పర్గా, దోతి, గ్రామాల్లో ఐకెపి గ్రామ సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు గజానన్ దేశాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వరిధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు డోంగ్లి వరి ధాన్యానికి క్వింటాలుకు మద్దతు ధర గ్రేడ్ ఏ రకం రూ.2389 సాధారణ రకం రూ.2369 ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు.

అదేవిధంగా మదన్ హిప్పర్గా గ్రామంలో సర్పంచ్ బాచావార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో, ధోతి గ్రామంలో సర్పంచ్ సంగం పటేల్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని వెల్లడించారు. రైతు శ్రేయస్సు కోసమే వరి ధాన్యం రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, డోంగ్లి మండలంలోని 13 గ్రామ పంచాయతీల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది వరి ధాన్యం రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -