నవతెలంగాణ – కాటారం
కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో స్వచ్ఛత, సురక్షిత వాతావరణం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా పెరిగిన మూళ్ళ చెట్లు, తుమ్మ చెట్లను పూర్తిగా తొలగించారు. అలాగే కాలనీలోని డ్రైనేజీ కాలువలను శుభ్రపరచి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంతకాని సడవాలి ఆధ్వర్యంలో పనులు చేపట్టగా, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య, ఉపసర్పంచ్ కొండగొర్ల బాణయ్య, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, వార్డ్ మెంబర్ కొండా రాము పాల్గొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు ఆత్మకూరి కుమార్ యాదవ్, పెండ్యాల శ్రీనివాస్, పెనుగొండ బాపు, బోడ్డు రాజశేఖర్ తదితరులు చురుకుగా సహకరించారు.
కాలనీని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వారు తెలిపారు.



