– ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులకు అవకాశం
– జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025 – 26 సంవత్సరానికి అమలు చేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ ( ఎస్సీ ఏపీ )లో భాగంగా పాడి గేదెల (2 యూనిట్లు) పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 8, 2026 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 16, 2026 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు గడువులోగా https://tgobmms.cgg.gov.in� వెబ్‌సైట్ ద్వారా లేదా సంబంధిత పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ , ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, పట్టాదార్ పాస్‌బుక్, వికలాంగుల కోసం సదరం సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు (2) అవసరమని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్యనిర్వహక సంచాలకులు పి. వెంకటేశ్ కోరారు.



