Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

- Advertisement -

– టీజీఎంసీ సిపిడి  కమిటీలో డాక్టర్ అరవింద్ గౌడ్ కో-ఆప్టెడ్ సభ్యుడిగా  నియామకం
నవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు, జనని హాస్పిటల్‌లో సీనియర్ పీడియాట్రిషన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ ఈ. అరవింద్ కుమార్ గౌడ్ కు రాష్ట్ర స్థాయి గౌరవం లభించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ( టి జి ఎం సి )లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ( సిపిడి ) కమిటీకి ఆయనను కో-ఆప్టెడ్ సభ్యునిగా నియమించారు. నేషనల్ మెడికల్ కమిషన్ ( ఎన్ఎంసి ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం అవసరం.

ఈ నేపథ్యంలో ప్రతి వైద్యుడు ప్రతి సంవత్సరం 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన సిపిడి కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది. సిపిడి కమిటీ ద్వారా ప్రొఫెషనల్, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మెడికో – లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డాక్టర్ అరవింద్ కుమార్ గౌడ్  నియామకంపై కామారెడ్డి జిల్లా వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -