– సమస్య పరిష్కారంతో ఆనందం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ ఎస్సీ కాలనిలో గత కొన్నేళ్లుగా నేటి ఇబ్బందులు నెలకొన్నాయి. కాలనీలోని రెండు బోరు బావులు ఎత్తిపోవడంతో, వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది. దీంతో కాలనీవాసులు నీటి సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇటీవల తమ కాలనీలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యను కాలనీ ప్రజలు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన సర్పంచ్ శైలేందర్ కాలనీలో నీటి సమస్యను తీర్చేందుకు కొత్త బోరు బావి తవ్వకం పనులను చేపట్టారు.
దీంట్లో భాగంగా ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, వార్డ్ సభ్యుడు దాసరి రాకేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి బోరు బావి తవ్వకం పనులను ప్రారంభించారు.200 ఫీట్ల లోతులోనే పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నూతనంగా వేసిన బోర్ బావి నుండి వాటర్ ట్యాంకు వరకు పైపులైన్ బిగింపు పనులను పూర్తి చేసి, వాటర్ ట్యాంక్ ను నింపి కాలనీవాసులకు నీటిని అందిస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ తెలిపారు.నీటి సమస్య గురించి చెప్పగానే తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చేసినందుకు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ కు నీటి సమస్య పరిష్కారం కోసం ఎంతో బాధ్యతాయుతంగా ముందుండి నడిపించిన వార్డుుు సభ్యుడు దాసరి రాకేష్ కు కాలనీవాసులుుు కృతజ్ఞతలు తెలిపారు.



