నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్ర శివారులోని శ్రీ సాయిబాబా సన్నిధిలో గురువారం ఘనంగా అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సకల దేవతల ఆశీర్వాదాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే గోమాతను అందంగా అలంకరించి గోమాత పూజలు చేశారు.పంచలోహాలతో కూడిన గోవిందగిరి స్వామి విగ్రహాన్ని నెలకొల్పిన ధ్యాన మందిరంలో భజన కళాకారులు భజనలు చేశారు.
భక్తుల జయ జయ ద్వానాల మధ్య సాయి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఆలయం వద్ద భీంగల్ కు చెందిన జిల్లా లక్ష్మీ రమేష్ దంపతులు, వారి కొడుకు కోడలు జిల్లా నవ్యశ్రీ రాజేష్ దంపతులు, సాయిబాబా ఆలయ అర్చకుడు కాజల్ అనురాగ్ పాండే దంపతులు, మోతెకు చెందిన చేపూర్ రాజవ్వ శ్రీనివాస్ దంపతులు అన్నదానం చేశారు. అన్నదాతలను శాలువా కప్పి వ్యవస్థాపకుల చిత్రపటాలని జ్ఞాపికగా బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు, తదితరులు పాల్గొన్నారు.



