Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎన్ఎస్ యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎన్ఎస్ యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
భీంగల్ పట్టణంలో గురువారం ఎన్ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ బొదిరే నాగమణి స్వామి, హాజరై ఎన్ ఎస్ యు ఐ యువకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ..విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు, విద్యార్థుల  చదువుల సమస్యల పట్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు ఎప్పుడు ముందుంటుందని ఎన్ ఎస్ యు ఐ ముందంజలో ఉంటుందని అన్నారు. యువకులకు 56వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ యువకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -